బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు | womens protest infront of balakrishna house | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు

Jul 9 2017 7:11 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు - Sakshi

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు

ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దంటూ హిందూపురం మహిళలు శనివారం కదం తొక్కారు.

జనావాసాల మధ్య మద్యం షాపులపై హిందూపురం మహిళల కన్నెర్ర
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు ముట్టడి, రాస్తారోకో


హిందూపురం అర్బన్‌:
ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దంటూ హిందూపురం మహిళలు కదం తొక్కారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి సమీపంలోని కాలనీకి వెళ్లే రోడ్డు పక్కనే మద్యం షాపు ఏర్పాటు చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాము ఇళ్లు విడిచి వెళ్లిపోవాలా అంటూ బాలకృష్ణ పీఏ కృష్ణమూర్తితో పాటు టీడీపీ నాయకులను నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ హిందూపురం మహిళలు శనివారం పెనుకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు వారిని అక్కడ్నుంచి బలవంతంగా పంపించేశారు. దీంతో మహిళలు నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లి అక్కడ బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే పీఏ, టీడీపీ నాయకులు బయటకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. చివరకు ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడి ఆ మద్యం దుకాణాన్ని మరోచోటకు మారుస్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఆందోళనలో వార్డు కౌన్సిలర్‌ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement