పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం | women suicide attempt | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం

Apr 16 2017 12:28 AM | Updated on Sep 5 2017 8:51 AM

ప్రేమించి వివాహం చేసుకున్న భర్త మోసం చేశాడని, ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒక వివాహిత స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మండలంలోని వాలుతిమ్మాపురం గ్రామానికి చెందిన బండారు ఇమామి

పెద్దాపురం : 
ప్రేమించి వివాహం చేసుకున్న భర్త మోసం చేశాడని, ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒక వివాహిత స్థానిక పోలీస్‌  స్టేషన్‌ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మండలంలోని వాలుతిమ్మాపురం గ్రామానికి చెందిన బండారు ఇమామి రెండేళ్ల కిందట పెద్దాపురానికి చెందిన బండారు ఆంజనేయులును ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఏడాదిన్నర పాటు సజావుగా సాగిన వారి జీవితంలో మనస్పర్ధలు వచ్చాయి. ఆరు నెలల కిందట పెద్దాపురం పీఎస్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో భర్త పరారయ్యాడు. పెద్దాపురం పోలీసులు ఆరు నెలల కిందట ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ కేసు నమోదు చేసినా ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయకపోవడంపై మనస్థాపానికి గురైన ఆమె స్టేస¯ŒS ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement