మహిళ ఆత్మహత్య | women suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Oct 7 2016 12:21 AM | Updated on Sep 4 2017 4:25 PM

నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని రామ్‌నగర్‌లో బుధవారం రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని రామ్‌నగర్‌లో బుధవారం రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. రామ్‌నగర్‌కు చెందిన ఎస్‌కే నజీమున్నీసా (45) మాససిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కొంత కాలంగా మందుల వాడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి బాత్‌రూంలోకి వెళ్లి శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కుమారుడు షేక్‌ షబ్బీర్‌ కూలిపనికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉంది. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె గతంలో నూతిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది.  ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై డి.భగావన్‌ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement