నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ | CM Ys Jagan Will Attends Srinivas Naidu Daughter Wedding Reception | Sakshi
Sakshi News home page

నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Mar 1 2023 10:26 AM | Updated on Mar 1 2023 1:09 PM

CM Ys Jagan Will Attends Srinivas Naidu Daughter Wedding Reception - Sakshi

నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్‌.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌కు సుబ్బరాజుపేట  హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్‌.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి  తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొన్నారు.

\

Advertisement
 
Advertisement
Advertisement