వైన్‌షాపు ఏర్పాటుపై మహిళల ఆందోళన | women protest on wine shop | Sakshi
Sakshi News home page

వైన్‌షాపు ఏర్పాటుపై మహిళల ఆందోళన

Mar 13 2017 10:58 PM | Updated on Sep 5 2017 5:59 AM

పేరుసోముల గ్రామంలో వైన్‌షాపు ఏర్పాటు నిరసిస్తూ మహిళలు సోమవారం ఐక్యంగా ఆందోళన చేపట్టారు.

- పేరుసోములలో ధర్నా
- మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచన 
సంజామల:  పేరుసోముల గ్రామంలో వైన్‌షాపు ఏర్పాటు నిరసిస్తూ మహిళలు సోమవారం ఐక్యంగా ఆందోళన చేపట్టారు. బస్టాండ్‌ సమీపంలో వైన్‌షాపు ఏర్పాటుకు నిబంధనలు అడ్డురావడంతో గ్రామంలో పెట్టేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు మహిళలు ఒప్పుకోలేదు. ఊరిబయట ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదని, గ్రామంలో ఏర్పాటు చేస్తే మందుబాబులతో ఇబ్బంది అవుతుందని తెలిపారు. మరెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని తేల్చిచెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement