నిప్పంటుకుని వివాహిత మృతి | Women killed in fire accident | Sakshi
Sakshi News home page

నిప్పంటుకుని వివాహిత మృతి

Jul 28 2016 7:47 PM | Updated on Oct 20 2018 6:04 PM

నిప్పంటుకుని వివాహిత మృతి - Sakshi

నిప్పంటుకుని వివాహిత మృతి

మనుబోలు : వంట చేస్తుండగా ఒంటికి నిప్పంటుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మనుబోలు దళితవాడలో గురువారం చోటు చేసుకుంది.

మనుబోలు : వంట చేస్తుండగా ఒంటికి నిప్పంటుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మనుబోలు దళితవాడలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... దళితవాడకు చెందిన మోచర్ల వెంకటరమణయ్య భార్య సురేఖ (28) ఇంట్లో వంట చేస్తుండగాప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విని చుట్టు పక్కల వాళ్లు మంటలను ఆర్పి 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోయింది.  108 సిబ్బంది చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా  మృతి చెందింది. అంబులెన్స్‌ వచ్చేలోపు ఒళ్లు కాలి సురేఖ చేసిన హాహాకారాలు స్థానికులను కంట తడి పెట్టించాయి. సురేఖకు ఎనిమిదేళ్ల కుమారుడు జయసూర్య, ఆరేళ్ల కుమార్తె నందిని ఉన్నారు. సురేఖ మృతితో స్థానిక దళితవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement