డెంగీతో మహిళ మృతి | women died with Dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో మహిళ మృతి

Jul 26 2016 12:28 AM | Updated on Sep 28 2018 3:41 PM

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌లోని విద్యానగర్‌ కాలనీకి చెందిన వట్టి మణెమ్మ(42) సోమవారం డెంగీతో మృతిచెందింది.

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌లోని విద్యానగర్‌ కాలనీకి చెందిన వట్టి మణెమ్మ(42) సోమవారం డెంగీతో మృతిచెందింది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామానికి చెందిన వట్టి మణెమ్మ తన భర్త పిల్లలతో కలిసి గత 15ఏళ్లుగా చౌటుప్పల్‌లోని విద్యానగర్‌ కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. 5రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. చౌటుప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంది. డాక్టర్లు పరీక్షలు చేసి, డెంగీ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన సర్నేనిగూడానికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement