మహిళ అనుమానాస్పద మృతి | woman suspicious death | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

May 7 2017 10:54 PM | Updated on Sep 5 2017 10:38 AM

చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులోని మార్కెట్‌ తనిఖీ కేంద్రం సమీపంలో ఊరు, పేరు తెలియని ఓ మహిళ(39) అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండగా ఆదివారం కనుగొన్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు.

చిలమత్తూరు(హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులోని మార్కెట్‌ తనిఖీ కేంద్రం సమీపంలో ఊరు, పేరు తెలియని ఓ మహిళ(39) అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండగా ఆదివారం కనుగొన్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు. చెక్‌పోస్టు మార్కెట్‌ తనిఖీ కేంద్రం పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని, భరించరాని దుర్వాసన వస్తోందంటూ తమకు సమాచారం అందిందన్నారు. సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు వివరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, ఏ ప్రాంతం వాసి, ఇది హత్యనా, కాదా? ఒక వేళ హత్య అయితే హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement