వివాహిత అనుమానాస్పద మృతి | woman suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 20 2017 12:02 AM | Updated on Sep 5 2017 6:31 AM

మడకశిర ఆరేపేటలో నివాసముంటున్న కలీం భార్య నజియాబాను(23)అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మడకశిర రూరల్‌ : మడకశిర ఆరేపేటలో నివాసముంటున్న కలీం భార్య నజియాబాను(23)అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం తరచూ తమ బిడ్డను వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ముందస్తు పథకం ప్రకారం నజియాబానును హతమార్చి, ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానుది మూమ్మటీకి హత్యేనని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌  చేశారు. కాగా అత్తమామలు పరారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement