టెక్కలిలో వివాహిత ఆత్మహత్య | woman suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

టెక్కలిలో వివాహిత ఆత్మహత్య

Feb 8 2016 10:09 PM | Updated on Sep 3 2017 5:11 PM

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టెక్కలి పట్టణానికి చెందిన చంద్రమౌళి, నాగమణి దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు.

టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టెక్కలి పట్టణానికి చెందిన చంద్రమౌళి, నాగమణి దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు.

చంద్రమౌళి స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు విధులకు వెళ్లిన సమయంలో నాగమణి ఇంట్లో ఉరేసుకుంది. భర్త తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆమె ఉరికి వేలాడుతోంది. కిందికి దింపి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. చంద్రమౌళి సమాచారం మేరకు నాగమణి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కట్నం కోసం చంద్రమౌళి పెట్టే మానసిక వేధింపులు భరించలేకే నాగమణి ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement