కుక్కునూరు : తన భర్త కనిపించడంలేదంటూ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీ సులు స్పందించడపోవడాన్ని నిరసిస్తూ ఓ మహిళ పోలీస్‌స్టేçÙన్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం కుక్కునూరులో చోటుచేసుకుంది.
మహిళ ఆత్మహత్యాయత్నం
Oct 16 2016 1:30 AM | Updated on Oct 20 2018 5:53 PM
కుక్కునూరు : తన భర్త కనిపించడంలేదంటూ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీ సులు స్పందించడపోవడాన్ని నిరసిస్తూ ఓ మహిళ పోలీస్‌స్టేçÙన్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం కుక్కునూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వంజవారిగూడేనికి చెందిన పొడియం సమ్మక్క అనే మహిళ గత నెల 10న తన భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు అత్తమామలే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి సమ్మక్క పోలీస్‌స్టే షన్ చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం పోలీస్‌స్టేçÙన్‌కు వెళ్లగా ఎస్సై ఉన్నా లేరని సమాధానం చెప్పించడంతో ఆమె ఆగ్రహించి స్టేషన్ ముందు బైఠాయించారు. కొద్దిసేపటికి ఎస్సై బయటకు రాగా కావాలనే కేసును నీరుగారుస్తున్నారంటూ ఆమె పోలీస్‌స్టేçÙన్ బిల్డింగ్‌పైకి ఎక్కారు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు ఆమెను సముదాయించి కిందకు దించారు. త్వరలోనే భర్త ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు ఆమెకు నచ్చజెప్పారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఆత్మహత్యాయత్నం జరగలేదని పోలీస్‌స్టేçÙన్ ముందు ఆమె బైటాయించిందని చెప్పారు.
Advertisement
Advertisement