‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా | Woman killed in accident | Sakshi
Sakshi News home page

‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా

May 10 2016 3:50 AM | Updated on Sep 3 2017 11:45 PM

‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా

‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా

తూర్పు గోదావరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్లో సోమవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన చింతగింజల విజయ(50) అనే మహిళ మృతి చెందింది.

రాష్ట్రానికి చెందిన మహిళ మృతి

 చింతూరు/మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్లో సోమవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన చింతగింజల విజయ(50) అనే మహిళ మృతి చెందింది. మరో 8 మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 45 మంది భక్తులు గతనెల 29న తీర్థయాత్రలకు బయలుదేరారు.

ఈ క్రమంలో సోమవారం మారేడుమిల్లి నుంచి భద్రాచలం బయలుదేరారు. బస్సు ఘాట్ రోడ్లో ఇజ్జలూరు సమీపంలో యూ టర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి పక్కనే లోయలోకి బోల్తా పడింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపుర్‌కు చెందిన విజయ బస్సులో ఇరుక్కుని మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement