యనమదుర్రు కాలువలో మహిళ మృతదేహం | woman dead body in canal | Sakshi
Sakshi News home page

యనమదుర్రు కాలువలో మహిళ మృతదేహం

Sep 15 2016 1:28 AM | Updated on Sep 4 2017 1:29 PM

యనమదుర్రు కాలువలో దెయ్యాలతిప్ప వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. తన కుమార్తె వెలిగొట్ల దుర్గానవ్య (21) కనిపించడం లేదని స్థానిక బలుసుమూడి బీసీ కాలనికి చెందిన సత్యనారాయణ టూటౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో మహిళ అదృశ్యమైనట్టు కేసును టూటౌన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు నమోదు చేశారు

భీమవరం టౌన్‌ : యనమదుర్రు కాలువలో దెయ్యాలతిప్ప వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. తన కుమార్తె వెలిగొట్ల దుర్గానవ్య (21) కనిపించడం లేదని స్థానిక బలుసుమూడి బీసీ కాలనికి చెందిన సత్యనారాయణ టూటౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో మహిళ అదృశ్యమైనట్టు కేసును టూటౌన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు నమోదు చేశారు.  ఇది జరిగిన కొద్ది గంటలకే మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ చెప్పారు. దుర్గానవ్య మానసిక స్థితి బాలేదని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈనెల 12న యనమదుర్రు కాలువలో దూకిన మహిళ దుర్గనవ్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.రమేష్‌బాబు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement