జనావాసాల మధ్య మద్యం షాపులా..? | wine shops in the midle of publice areas | Sakshi
Sakshi News home page

జనావాసాల మధ్య మద్యం షాపులా..?

Mar 30 2017 11:10 PM | Updated on Nov 9 2018 5:56 PM

జనావాసాల మధ్య మద్యం షాపులా..? - Sakshi

జనావాసాల మధ్య మద్యం షాపులా..?

హైవేకు 500 మీటర్ల దూ రంలో మద్యం విక్రయాలను నిర్వహిం చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం జనావాసాల మధ్య ఏర్పాటు చేసేందుకు

నెల్లూరు సిటీ: హైవేకు 500 మీటర్ల దూ రంలో మద్యం విక్రయాలను నిర్వహిం చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం జనావాసాల మధ్య ఏర్పాటు చేసేందుకు అనుమతులివ్వడంపై రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి మండిపడ్డారు. ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతున్న కొత్త లిక్కర్‌ నిబంధనల్లో ఇళ్ల మధ్యే దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ నెలకు రూ.ఐదు కోట్ల లంచం తీసుకుంటోందని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి రూ.780 కోట్ల ఎక్సైజ్‌ శాఖ అవినీతికి చంద్రబాబు ప్రోత్సాహం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారుల అవినీతిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని తలపించేలా మరో ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుడుతుందని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావు, రఘురామ్‌ ముదిరాజ్, బాలసుధాకర్, సూర్యనారాయణ, గణేష్, కస్తూరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement