ఈ అభాగ్యురాలెవరో? | who is she ? | Sakshi
Sakshi News home page

ఈ అభాగ్యురాలెవరో?

Jan 5 2016 7:21 AM | Updated on Sep 3 2017 3:05 PM

ఈ అభాగ్యురాలెవరో?

ఈ అభాగ్యురాలెవరో?

ఓ అమాయక గిరిజన యువతి తనకు ఎవరూ లేరంటూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది.

దిక్కుతోచని స్థితిలో గర్భిణి
 కాకినాడ క్రైం :
ఓ అమాయక గిరిజన యువతి తనకు ఎవరూ లేరంటూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెగర్భిణికావడం, సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తన పేరు పార్వతి అని, తమది కొత్తపల్లి అని మాత్రమే ఆ యువతి చెబుతోంది. మరే ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో ఆమె వివరాలు తెలియరాలేదు. వైద్యులు ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకోకపోవడంతో అధికారులకు విలేకరులు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు స్పందించి ఆమెను ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు.
 
  ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరనే విషయాలు తెలియకపోవడంతో సిబ్బంది సందిగ్ధంలో పడ్డారు. గర్భవతి అయిన ఆ యువతి షాక్‌కు గురై ఉంటుందని, ఎవరో ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. ఆమె గిరిజన యువతి కావడంతో ఐటీడీఏ అధికారులు  స్పందించి ఆమెను చేరదీయాలని కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement