నేడు, రేపు వర్ష సూచన | weather forecast for coastal andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు, రేపు వర్ష సూచన

Mar 20 2017 8:23 AM | Updated on Sep 5 2017 6:36 AM

విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.

సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.

దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలోను, మంగళవారం రాయలసీమలోను అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు గాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులకు, అకాల వర్షాలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement