ఏపీకి భారీ వర్ష సూచన.. నాలుగు రోజులు ఈ జిల్లాలో వానలు | IMD Says Four Days Rain Forecast To AP | Sakshi
Sakshi News home page

ఏపీకి భారీ వర్ష సూచన.. నాలుగు రోజులు ఈ జిల్లాలో వానలు

Oct 15 2026 9:15 AM | Updated on Oct 15 2026 9:15 AM

IMD Says Four Days Rain Forecast To AP

సాక్షి, విశాఖ: ఏపీలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే ఈశాన్య గాలుల ప్రభావంతో వాతావరణం చల్లబడింది.

ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని తెలిపారు.

వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్లు, భారీ హోర్డింగుల కింద నిలబడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల ప్రమాదం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: జనసేనా.. మళ్లీ తలొగ్గడమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement