పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి | we should take care in pusshkar | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి

Aug 11 2016 12:20 AM | Updated on Sep 4 2017 8:43 AM

పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి

పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి

కృష్ణ పుష్కరాల్లో పోలీస్‌ యంత్రాగం అప్రమతంగా ఉండాలని ఏఎస్పీ గంగారామ్‌ సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బుధవారం భువనగిరిలోని ఏఆర్‌ గార్డెన్‌లో జరిగిన డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు.

–ఏఎస్పీ గంగారామ్‌  
భువనగిరి  
కృష్ణ పుష్కరాల్లో పోలీస్‌ యంత్రాగం అప్రమతంగా ఉండాలని ఏఎస్పీ గంగారామ్‌ సూచించారు.  పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బుధవారం భువనగిరిలోని ఏఆర్‌ గార్డెన్‌లో జరిగిన డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. డివిజన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ పాయింట్ల వద్ద పోలీస్‌ సిబ్బంది ఉండాలని చెప్పారు. ఎప్పటి కప్పుడు వాహనాల రద్ది గుర్చి సమాచారం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా భువనగిరిలోని నల్లగొండ చౌరస్తా వద్ద 1. మండలంలోని వడపర్తి వద్ద 2, చౌటుప్పల్‌ వద్ద 1, పోచంపల్లి మండలంలోని లక్కారం వద్ద 1 హోల్డింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య రాకుండా ముందు ఉన్న వాహనాలు వెళ్లిన తర్వాత వెనుకల వచ్చే వాహనాలను పంపిచాలని సూచించారు.  సమావేశంలో సీఐలు ఎం. శంకర్‌గౌడ్,  అర్జునయ్య, రాఘువీర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు మంజునా«ద్‌రెడ్డి, హన్మంత్‌లాల్, ఎండి సజిదుల్లా, మధుసూదన్‌రెడ్డి, నర్సింహ్మ, రాజశేఖర్‌రెడ్డి, ఏఎస్‌ఐ లింగమాయ్య, కానిస్టేబుల్, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటర్లు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement