ఇస్త్రీ పని కష్టంగా అనిపిస్తోందా? కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే బట్టలను చక్కగా మడతలు లేకుండా చేసేయొచ్చు.
బట్టలను తిరగేసి లోపలి భాగం వైపు ఇస్త్రీ చేయడం వల్ల సులభంగా పనిపూర్తవుతుంది.
అంతేకాకుండా రంగులు వెలిసిపోకుండా ఉంటాయి. నల్లటి బట్టలపై పడే ఐరన్ మెరుపు ముద్రలను కూడా నివారించవచ్చు.
బట్టల మీద చాలామంది డైరెక్టుగా నీటిని చల్లుతుంటారు. అలాకాకుండా, ఒక పలుచని తడి క్లాత్‌ని బట్టలపై పరిచి ఐరన్ చేస్తే బట్టలు సాగకుండా ఉంటాయి.
షర్టులను ఇస్త్రీ చేసేపుడు బటన్లన్నీ పెట్టేయకుండా కేవలం పై బటన్ మాత్రమే పెట్టి, కాలర్ నుంచి కిందికి ఐరన్ చేయడం వల్ల కాలర్‌లు పాడవకుండా ఉంటాయి, టైమ్ సేవింగ్ కూడా.
సిల్క్ లేదా కాటన్ బట్టలపై కాస్త నీటిని స్ప్రే చేసి, ΄్లాస్టిక్ కవర్‌లో పెట్టి రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి. ఉదయాన్నే బయటకు తీసి 20 నిమిషాల తర్వాత ఐరన్ చేస్తే ముడతలు పోతాయి.
ఇస్త్రీ చేయడానికి వాడే నీటిలో లేదా వెట్ క్లాత్ నానబెట్టిన నీటిలో కొన్ని చుక్కల పర్ఫ్యూమ్ ఆయిల్ కలిపితే, ఇస్త్రీ చేసిన బట్టల నుంచి రోజంతా మంచి సువాసన వస్తుంది.
ఇవి కూడా చదవండి: థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు!


