సింధుకు వందనం | we salute to your victory sindhu | Sakshi
Sakshi News home page

సింధుకు వందనం

Aug 20 2016 11:14 PM | Updated on Sep 4 2017 10:06 AM

సింధుకు వందనం

సింధుకు వందనం

రియో ఒలింపిక్స్‌లో మహిళా బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు రావులపాలెం లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్, లెర్నింగ్‌ బడ్స్‌ విద్యార్థులు వినూత్నంగా జేజేలు పలికారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్రాంగణంలో రజత పతకాన్ని ముద్దాడుతున్న సింధు చిత్రం గీసి, దా

రియో ఒలింపిక్స్‌లో మహిళా బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు రావులపాలెం లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్, లెర్నింగ్‌ బడ్స్‌  విద్యార్థులు వినూత్నంగా జేజేలు పలికారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్రాంగణంలో రజత పతకాన్ని ముద్దాడుతున్న సింధు చిత్రం గీసి, దానిచుట్టూ రంగురంగుల దుస్తులు ధరించిన విద్యార్థులు భారతదేశ పటం ఆకారంలో నిలబడి సెల్యూట్‌ చేశారు. అనంతరం మోకరిల్లి జేజేలు పలికారు. ‘వియ్‌ సెల్యూట్‌ టు యువర్‌ విక్టరీ సింధు’ అని ఆంగ్ల అక్షరాల్లో రాసి, త్రివర్ణ పతాకం, షటిల్‌ బ్యాట్‌ చిత్రాలను వేసి సింధు విజయాన్ని శ్లాఘించారు. పాఠశాల డైరెక్టర్‌ పీవీఎస్‌ సూర్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
– రావులపాలెం

Advertisement
 
Advertisement
Advertisement