'మేం రైతు వ్యతిరేకులం కాదు' | we are not against farmers: bangaru laxman | Sakshi
Sakshi News home page

'మేం రైతు వ్యతిరేకులం కాదు'

Sep 30 2015 10:25 AM | Updated on Apr 7 2019 3:47 PM

నగరంలో రోడ్ల పరిస్థితిపై, చైన్ స్నాచింగ్లపై వాయిదా తీర్మానం తిరస్కరించడంపై మాట్లాడదామని తాము అనుకున్నామని, మంత్రిగారు రైతులకు తాము వ్యతిరేకులమని వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిస్థితిపై, చైన్ స్నాచింగ్లపై వాయిదా తీర్మానం తిరస్కరించడంపై మాట్లాడదామని తాము అనుకున్నామని, మంత్రి హరీశ్ రావు రైతులకు తాము వ్యతిరేకులమని వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఒక్క రోజే 13 చైన్ స్నాచింగ్లు జరిగాయని ఈ విషయం తీవ్రంగా ఉన్నందునే తాము వాయిదా తీర్మానం ఇచ్చామని ఆయన చెప్పారు. అది ఎందుకు స్పీకర్ తిరస్కరించారో వివరిస్తే బాగుంటుంది తప్పా ఇలా మంత్రి హరీశ్ రావు నిందలు వేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement