పాఠశాలలకు మంచినీటి ట్యాంక్‌ల బహూకరణ | Water tanks doneted to schools | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు మంచినీటి ట్యాంక్‌ల బహూకరణ

Sep 18 2016 12:29 AM | Updated on Sep 4 2017 1:53 PM

పాఠశాలలకు మంచినీటి ట్యాంక్‌ల బహూకరణ

పాఠశాలలకు మంచినీటి ట్యాంక్‌ల బహూకరణ

పట్టణంలోని ఆజాద్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, అంబేద్కర్‌ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చిమిర్యాల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యం కోసం శనివారం వాసవీక్లబ్స్‌ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్‌ట్యాంక్‌లను అందజేశారు.

కోదాడఅర్బన్‌: పట్టణంలోని ఆజాద్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, అంబేద్కర్‌ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చిమిర్యాల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యం కోసం  శనివారం వాసవీక్లబ్స్‌ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్‌ట్యాంక్‌లను అందజేశారు. అదే విధంగా అమీనాబాద్‌ పాఠశాలకు 20కుర్చీలతో పాటు బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.  వాసవీక్లబ్స్‌ జిల్లా గవర్నర్‌ బండారు వెంకటేశ్వర్లు  వీటిని పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో క్లబ్స్‌ క్యాబినెట్‌ కార్యదర్శి బుక్కా వెంకయ్య, క్లబ్స్‌ నిర్వాహకులు పబ్బా గీత, బొగ్గారపు రేఖారాణి, వి.రమ, శ్రీలక్ష్మి, శ్రీదేవి, వై.రాణి, క్రాంతికుమారి, గీత, రాధిక, సుశీల, ఉమ, అనురాధ, నళినిశ్రీ, ఝూన్సీ, సీత, మణి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement