23న పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా శనివారం నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నట్టు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి.
2026–27 విద్యా కేలండర్‌లో ప్రకటించిన మేరకు ఈనెల 23న ప్రభుత్వ పాఠశాలలు, 22న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపాయి.


