'పల్లె'కు దూరం | village buses stops due to less income in rtc | Sakshi
Sakshi News home page

'పల్లె'కు దూరం

Nov 2 2016 10:02 AM | Updated on Sep 4 2017 6:59 PM

'పల్లె'కు దూరం

'పల్లె'కు దూరం

ఆర్టీసీ అధికారులు ఆదాయం రావడం లేదనే సాకుతో ఆయా పల్లెలకు బస్సులను దూరం చేస్తుంటే, అవే గ్రామాల నుంచి ప్రైవేట్‌ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నా యి.

ఆర్టీసీ అధికారులు ఆదాయం రావడం లేదనే సాకుతో ఆయా పల్లెలకు బస్సులను దూరం చేస్తుంటే, అవే గ్రామాల నుంచి ప్రైవేట్‌ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నా యి. పదుల సంఖ్యలో ఆటోలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. అయినా ఆర్టీసీ బస్సులకు ఆదరణ లేదంటూ అధికారులు తప్పించుకోవడాన్ని ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు తప్పుపడుతున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో ప్రయాణం చేస్తున్న ప్రజలు, సమయానికి ట్రిప్పు నడిపిస్తే బస్సుల్లో ఎందుకు ప్రయాణం చేయరని వారు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి, సిరిసిల్ల :
‘ప్రతీ పల్లెకు ఆర్టీసీ ప్రగతి చక్రా లు’ అంటూ అధికారులు ఊదరగొడుతున్నా వాస్తవం రూపం దాల్చడం లేదు. కొత్త పాలనలో సరికొత్త సేవలందించాల్సిన ఆర్టీసీ.. ఆచరణలో విఫలమవుతోంది. ప్రతీపల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, భారీగా నష్టపోతున్నా ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నామని చెబుతున్నా నమ్మే పరిస్థితిలేదు. కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 224 గ్రామాలున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డిపోలతోపాటు, కరీంనగర్, కోరుట్ల, కామారెడ్డి తదితర ఇతర ప్రాంతాలకు చెందిన డిపోల బస్సులు జిల్లాలో ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయినా, ఆర్టీసీ బస్సు గురించి తెలియని పల్లెలు జిల్లాలో 26 ఉండడం విస్మయా న్ని కలిగిస్తోంది. రూట్‌కు సమీపం లో ఉన్నా, మెరుగైన రోడ్డు మార్గం ఉన్నా, ప్రజలు ఆర్టీసీ వైపే ఆసక్తి చూపుతున్నా.. ఆదాయం లేదనే సాకుతోనే అధికారులు ఈ గ్రామాలకు బస్సులు నడిపించడంలేదనే విమర్శలున్నాయి. జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు సమీపంలోని అంకుసాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, ఇందిరానాగర్, ఇప్పలపల్లి, వేణుగోపాల్‌పూర్, వేములవాడ పట్టణానికి సమీపంలోని అనుపురం, రుద్రారం, కొడిముంజ, లింగంపల్లి తదితర గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. సమీప గ్రామాలు కాబట్టి, ఆదాయం అంతగా ఉండదనే సాకుతో బస్సు సర్వీసులు ఈ గ్రామాలకు వెళ్లడం లేదు.

ఆదాయం ఘనం..
జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గానే ఉంది. రెండు డిపోలకు గాను సిరిసిల్ల డిపో పరిధిలో రోజూ రూ.7లక్షల చొప్పున ఏడాదికి రూ.36.57కోట్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో పరిధిలో ఏడాదికి రూ.20.88 కోట్ల ఆదాయం వస్తోంది. మొత్తంగా జిల్లాలో ఆర్టీసీకి సుమారు రూ.58 కోట్ల ఆదాయం వస్తున్నా, అన్ని పల్లెలకు సేవలందించడంలో ముందుకు రావడంలేదు.

ప్రణాళికా లోపంతోనే...
ఆర్టీసీ అధికారులు సరైన ప్రణాళిక రూపొందించ లేకపోవడంతోనే జిల్లాలో 26 గ్రామాలు బస్సు సేవలకు దూరమయ్యాయనే విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధుల సూచన, గ్రామస్తుల విన్నపం మేరకు కొన్ని రూట్లలో బస్సులను నడిపించిన అధికారులు.. ఆదాయం రావడం లేదంటూ కొద్దిరోజుల్లోనే ఆ రూట్లలో సర్వీసులు నిలిపివేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనువైన సమయవేళల్లో బస్సులను నడిపిస్తే ఆదాయం తప్పకుండా పెరుగుతుందని, ఆ దిశగా ప్రణాళిక ప్రకారం సర్వీసులు నడిపించాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పట్టణాలకు సమీపంలో ఉన్నాయనే కారణంతో పల్లెలకు బస్సులు నడిపించకపోవడం సరికాదంటున్నారు. ఆయా రూట్లలో వెళ్లే బస్సులను ఆ గ్రామాల గుండా మళ్లిస్తే ప్రజలకు ఆర్టీసీ సేవలందించడంతోపాటు, ఆదాయాన్ని పెంచుకోవచ్చంటున్నారు. ఆర్టీసీ అధికారులు పటిష్ట ప్రణాళికతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు సేవలందించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement