చుక్కల్లోనే కూరగాయల ధరలు | vegitables rates not decreased | Sakshi
Sakshi News home page

చుక్కల్లోనే కూరగాయల ధరలు

Jul 24 2017 12:07 AM | Updated on Sep 5 2017 4:43 PM

చుక్కల్లోనే కూరగాయల ధరలు

చుక్కల్లోనే కూరగాయల ధరలు

టమాటాల ధర బాటలో వంకాయలు పయనిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో వంకాయలు ధరకు రెక్కలు వచ్చాయి. నల్ల వంకాయల ధర కిలో రూ.40కి ఎగబాకింది. తెల్లవంకాయల ధర రూ.50 పలికింది. క్యాప్సికం ధర కెవ్వుమనిపించి కిలో రూ.80కి చేరుకుంది.

తాడేపల్లిగూడెం : టమాటాల ధర బాటలో వంకాయలు పయనిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో వంకాయలు ధరకు రెక్కలు వచ్చాయి. నల్ల వంకాయల ధర కిలో రూ.40కి ఎగబాకింది. తెల్లవంకాయల ధర రూ.50 పలికింది. క్యాప్సికం ధర కెవ్వుమనిపించి కిలో రూ.80కి చేరుకుంది. బీన్స్‌ సెంచరీ మార్కుకు చేరాయి. కీరా కూడా కిలో రూ.50కి చేరుకుంది. దొండకాయలు కిలో రూ.30, బెండకాయలు రూ.30, బీర రూ.40, దోసకాయలు రూ.24, కంద రూ.40, క్యాబేజీ రూ.20, క్యారెట్‌ రూ.40, బీట్‌రూట్‌ రూ.30, బీన్స్‌ రూ.90 ధర పలికాయి. చామ రూ.40, మిర్చి రూ.40కి అమ్మారు. మామిడికాయ ఒకటీ రూ.10, ములగకాడలు జత రూ.12 చేసి విక్రయించారు. టమాటాలు కాస్త కనికరం చూపించాయి. గుత్తగా 25 కిలోల ట్రే రూ.1,800 నుంచి రూ.1,600కి తగ్గింది. రిౖటైల్‌గా మాత్రం కిలో రూ.80 అమ్మారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement