నేటి నుంచి వేదశాస్త్ర పరీక్షలు | vedasasta exams today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వేదశాస్త్ర పరీక్షలు

Aug 19 2016 9:30 PM | Updated on Sep 26 2018 3:25 PM

వేదశాస్త్ర పరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 24వరకు వేదపరీక్షలు జరుగుతాయని పరిషత్తు కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్నీసుపేటలోని కెనరాబ్యాంకు పక్కనే గల హోతావారి భవనంలో వివిధ విభాగాల్లో జరిగే ఈ పరీక్షలకు పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారని తెలిపారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌ :
వేదశాస్త్ర పరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 24వరకు వేదపరీక్షలు జరుగుతాయని పరిషత్తు కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్నీసుపేటలోని కెనరాబ్యాంకు పక్కనే గల హోతావారి భవనంలో వివిధ విభాగాల్లో జరిగే ఈ పరీక్షలకు పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారని తెలిపారు. ఈనెల25వ తేదీ ఉదయం7.30 గంటలకు టి.నగరులోని విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి మార్కండేయేశ్వర స్వామి ఆలయం వరకు వేదపండితుల స్వస్తివాచకులతో ఊరేగింపు జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దానవాయి పేట, చిన్నగాంధీబొమ్మ సమీపంలోని వాడ్రేవువారి ఇంటిలో పండిత మహాసభ జరుగుతుందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement