నేడు నగరానికి వాసవీమాత పాదుకలు | vasavi matha padukas comes to anantapur today | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి వాసవీమాత పాదుకలు

Jul 29 2016 10:10 PM | Updated on Jun 1 2018 8:39 PM

వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు.

అనంతపురం కల్చరల్‌ : వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి  వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు. శుక్రవారం అమ్మవారి శాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు అమ్మవారి పాదులను రాజురోడ్డులోని వైశ్య హాస్టల్‌ నుంచి కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు వస్తామన్నారు. అనంతరం రెండు టన్నుల బరువుతో తయారైన పంచలోహ విగ్రహానికి ఆలయంలో క్షీరాభిషేకాలు జరుగుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement