ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు | vana bhojanalu in p.sadlapalli | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు

Nov 27 2016 11:07 PM | Updated on Sep 4 2017 9:17 PM

ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు

ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు

రాష్ట్రంలో కాపు, బలిజలందరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు.

లేపాక్షి : రాష్ట్రంలో కాపు, బలిజలందరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు. ఆదివారం ఉదయం లేపాక్షి మండలం పి.సడ్లపల్లిలో గ్రామ సర్పంచ్‌ అశ్వర్థనారాయణ తోటలో హిందూపురం బలిజసంఘం యూత్‌ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు చేయడంతో కాపు, బలిజల ఐక్యతకు దోహదపడుతుందన్నారు.

భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఐక్యత అవసరమన్నారు. ఐక్యతా లోపంతో రాజ్యాధికారం కోల్పోతున్నామని వాపోయారు. కార్యక్రమంలో హిందూపురం బలిజ సంఘం నాయకులు రాయల్‌ గోపాల్, మారుతీ శ్రీనివాస్, రామచంద్ర, రమణ, విజయానంద్, మల్లెపూల మధు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement