ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుళార్థ పశువైద్యశాలలో గురువారం.. పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వాక్సిన్‌ను ఉచితంగా వేవారు.
పెంపుడు కుక్కలకు టీకాలు
Jul 7 2017 12:12 AM | Updated on Sep 5 2017 3:22 PM
కర్నూలు (అగ్రికల్చర్) : ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుళార్థ పశువైద్యశాలలో గురువారం.. పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వాక్సిన్‌ను ఉచితంగా వేవారు. ఈ సందర్బంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.సుదర్శన్‌కుమార్ మాట్లాడుతూ.. పందుల నుంచి మెదడు వాపు వ్యాధి సోకుతుందని, వీటిని నివాసాలకు దూరంగా ఉంచాలన్నారు. పశుపోషకులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, కబేళాల్లో పనిచేసే వారు విధిగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు డీడీ సీవీ రమణయ్య, వెటర్నరీ పాలీ క్లీనిక్ డీడీ హమాద్‌పాష, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ శ్రీలక్ష్మి, పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ విజయుడు, అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్‌లు రవిబాబు శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement