తిరుమలలో వైభవంగా ఉట్లోత్సవం | Utlotsavam in Tirumala at ground level | Sakshi
Sakshi News home page

తిరుమలలో వైభవంగా ఉట్లోత్సవం

Aug 26 2016 5:17 PM | Updated on Sep 4 2017 11:01 AM

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో శుక్రవారం ఉట్లోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో శుక్రవారం ఉట్లోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి మలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామివార్ల ఊరేగింపు తిరువీధుల్లో వైభవంగా సాగింది. అనంతరం జరిగిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది కృష్ణాష్టమికి మరుసటి రోజున ఉట్లోత్సవాన్ని నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తోంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement