సేవలు సద్వినియోగం చేసుకోవాలి | utilize the Services of anganwadi's | Sakshi
Sakshi News home page

సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Jul 23 2016 11:49 PM | Updated on Jun 2 2018 8:36 PM

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను శిశువుల తల్లిదండ్రులు, గర్భిణులు సద్వినియోగించుకోవాలని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేంద్ర బోయి అన్నారు. మండలంలోని పెద్దపెండ్యాల అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం జరిగిన హరితహారం కార్యక్రమం లో ఆమె పాల్గొని మొక్కలు నాటారు.

రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేంద్ర బోయి
 
పెద్దపెండ్యాల(ధర్మసాగర్‌ ): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను  శిశువుల తల్లిదండ్రులు, గర్భిణులు సద్వినియోగిం చుకోవాలని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేంద్ర బోయి అన్నారు. మండలంలోని పెద్దపెండ్యాల అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం జరిగిన హరితహారం కార్యక్రమం లో ఆమె పాల్గొని మొక్కలు నాటారు.
 
అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్ర భవనాలు ఉన్న చోట పెద్దఎత్తున మెుక్కలను నాటాలని సూచించారు. అనంరతం స్థానిక అంగన్‌వాడీ సెంటర్లలో అందుతున్న సేవలను పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. భవనాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులను కో రారు. గర్భిణీ, బాలింతలకు ఆమె మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ తోట స్రవంతి, ఎంపీటీసీ సభ్యురాలు శిఖ వసంత, ఉపసర్పంచ్‌ సమ్మిరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ శైలజ, సీడీపీఓలు జయంతి, సబిత, ఏసీడీపీవో బాల త్రిపురసుందరి, ప్రేమలత, సూపర్‌వైజర్లు ఆర్‌.రమాదేవి, బి.రమాదేవి, పుణ్యవతి, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement