గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | unknown deadbody found | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Jul 7 2017 12:15 AM | Updated on Sep 5 2017 3:22 PM

వెల్దుర్తి, మాదార్‌పురం గ్రామాల మధ్య రైల్వేట్రాక్‌ పక్కన గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు డోన్‌ రైల్వే ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.

వెల్దుర్తి(కృష్ణగిరి) : వెల్దుర్తి, మాదార్‌పురం గ్రామాల మధ్య రైల్వేట్రాక్‌ పక్కన గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు డోన్‌ రైల్వే ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోందన్నారు. దాదాపు వారం రోజుల కిందట సంఘటన జరిగి ఉండవచ్చని, మృతదేహం గుర్తు పట్టడానికి వీలు లేనంతగా తయారైందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని కర్నూలు హెచ్‌సీలు నాగలక్ష్మి, కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement