గుర్తుతెలియని మృతదేహం లభ్యం
భువనగిరి అర్బన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం భువనగిరి మండలంలోని అనాజిపురంలో చోటుచేసుకుంది.
భువనగిరి అర్బన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం భువనగిరి మండలంలోని అనాజిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 55ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మండలంలోని అనాజిపురం గ్రామ శివారులోని బస్‌షెల్టర్ వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృ తదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఏఎస్‌ఐ ఎం.బాసు తెలిపారు. మృతుడి కుడి చేతిపై శ్రీ అని రాసి ఉంది. ఒంటిపై సిమెంట్ కలర్ అంగీ, లూంటీ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఏఎస్‌ఐ కోరారు.