'రెండు రూపాయల' డాక్టర్‌ మృతి | two ruppe doctor died with unhealthy | Sakshi
Sakshi News home page

'రెండు రూపాయల' డాక్టర్‌ మృతి

Sep 21 2016 11:32 PM | Updated on Sep 4 2017 2:24 PM

డాక్టర్‌ రాచన్న (ఫైల్‌)

డాక్టర్‌ రాచన్న (ఫైల్‌)

రెండు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి పొందిన డాక్టర్‌ రాచన్న(63) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు.

రాజేంద్రనగర్‌: రెండు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి పొందిన డాక్టర్‌ రాచన్న(63) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ రాచన్న నాలుగు దశాబ్ధాలుగా పరిసర ప్రాంతాల్లో రెండు రూపాయల డాక్టర్‌గా చిరపరిచితుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ చురుకైన పాత్ర పొషించిన ఆయన ప్రస్తుతం చార్మినార్‌ బాగ్‌ సహసంగ్‌ చాలక్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వెంకటేశ్వర్‌రావు, మురళీధర్‌రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సాయంత్రం మైలార్‌దేవ్‌పల్లి శ్మశానవాటికలో అంతక్రియలు నిర్వహించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement