తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో అలిపిరి సమీపంలో 57వ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో అలిపిరి సమీపంలో 57వ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న ఓ కారు, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్టు పోలీసులు తెలిపారు.
అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా భయటపడ్డారు. కాగా, ట్రాఫిక్ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.