ఎర్రచందనం దుంగలు స్వాధీనం | two red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 25 2017 9:46 PM | Updated on Oct 22 2018 1:59 PM

ఎర్రచందనం దుంగలు స్వాధీనం - Sakshi

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను నందలూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు అరెస్టు

నందలూరు: ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను నందలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు నందలూరు యస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4–30 గంటల సయమంలో చింతలకుంట అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన సెల్వం, అన్నామలైతోపాటు మరికొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు.

పక్కా సమాచారంతో  దాడి చేశామని, ఇద్దరు దొరకగా మిగిలిన వారు పరారయ్యారని ఆయన తెలిపారు. నాలుగు ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement