ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు దుర్మరణం | Two killed in road accident in kurnool district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు దుర్మరణం

Jun 21 2016 8:33 AM | Updated on Aug 30 2018 4:07 PM

కర్నూలు జిల్లా నంద్యాల సాంబవరం మెట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సాంబవరం మెట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన ధనలక్ష్మి, మణెమ్మగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement