వినాయక నిమజ్జనంలో అపశృతి | two died in khammam | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశృతి

Sep 27 2015 6:09 PM | Updated on Aug 25 2018 6:06 PM

ఖమ్మం పట్టణంలోని మున్నూరు బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది.

ఖమ్మం:  పట్టణంలోని మున్నూరు బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. వారిని రాజస్థాన్ కు చెందిన గోపాల్, విక్రమ్ లుగా గుర్తించారు.

 

ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో వినాయక నిమజ్జనంలో భాగంగా కిరోసిన్  నోట్లో పోసుకుని నిప్పులు వెదజల్లే విన్యాసం చేస్తుండగా ఎదురుగా ఉన్న నలుగురు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి.  వీరిని హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  గాయపడిన వారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement