నీటికుంటలో పడి చిన్నారుల దుర్మరణం | two child died in Water Pond at medak district | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి చిన్నారుల దుర్మరణం

Jan 17 2016 5:30 PM | Updated on Aug 25 2018 6:53 PM

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

జగదేవ్‌పూర్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరెల్లికి చెందిన ప్రేమ కుమార్ (17), అదే మండలం పెద్దరాజుపేటకు చెందిన రాహుల్(14) సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఊరైన చాట్లపల్లి వచ్చారు. ఇరువురు వరుసకు సోదరులు. ప్రేమ కుమార్ ఇంటర్ చదువుతుండగా... రాహుల్ 9వ తరగతి చదువుతున్నాడు.  ఆదివారం పొలంలో ఉన్న నీటికుంటలో దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement