టీఆర్‌ఎస్ నాయకుడికి తృటిలో తప్పిన ప్రమాదం | TRS leader narrowly missed a risk | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ నాయకుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Nov 2 2016 2:17 AM | Updated on Sep 4 2017 6:53 PM

టీఆర్‌ఎస్ నాయకుడికి   తృటిలో తప్పిన ప్రమాదం

టీఆర్‌ఎస్ నాయకుడికి తృటిలో తప్పిన ప్రమాదం

జనగామ-హన్మకొండ జాతీయ రహదారిపై ప్రమాదాన్ని సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ నాయకుడు...

జనగామ అర్బన్ : జనగామ-హన్మకొండ జాతీయ రహదారిపై ప్రమాదాన్ని సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ నాయకుడు, బార్ అసోసియేషన్ నాయకుడు తృటిలో తప్పించుకున్నారు. స్థాని కు ల కథనం ప్రకారం... వరంగల్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ముద్దసాని సహోదర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ నాయకుడు బైరపాక జయాకర్ కలిసి ఇన్నోవాలో వికారాబాద్‌కు వెళ్తున్నారు.

ఈ క్రమంలో జనగామ పాలశీతలీకరణ కేంద్రం వద్దకు వెళ్తున్న మరో ఇన్నోవా వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయగా రెండు వాహనాలు ఢీకొన్నారుు. దీంతో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నారుు. వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి తల్లి మరణించిందని తెలుసుకొని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement