ఆశ్రమ పాఠశాల ఖాళీ | tribule school empty | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల ఖాళీ

Aug 28 2016 10:18 PM | Updated on Nov 9 2018 4:40 PM

మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఖాళీ అయింది. భూక్యా స్వామి అనే ఏడో తరగతి విద్యార్థి సెల్‌ఫోన్‌ చార్జర్‌ విషయంలో ప్రధానోపాధ్యాయుడి మందలింపుతో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో విద్యార్థులు షాక్‌ నుంచి తేరుకోలేదు.

  • ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు
  •  కోనరావుపేట : మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఖాళీ అయింది. భూక్యా స్వామి అనే ఏడో తరగతి విద్యార్థి సెల్‌ఫోన్‌ చార్జర్‌ విషయంలో ప్రధానోపాధ్యాయుడి మందలింపుతో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో విద్యార్థులు షాక్‌ నుంచి తేరుకోలేదు. తోటి విద్యార్థి మృతి, వార్డెన్‌ సహా వంట మనుషులు, ఉపాధ్యాయులు సస్పెండ్‌ కావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి చేరారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆదివారం ఆశ్రమ పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. వారితో పాటే మిగితా విద్యార్థులు కూడా వెళ్లిపోయారు. మొత్తం 64 మంది విద్యార్థులున్న పాఠశాల ఒక్కసారిగా బోసిపోయింది. ఈవిషయమై ఎంఈవో రఘుపతి మాట్లాడుతూ పాఠశాలను యథావిధిగా కొనసాగించేందుకు గిరిజన సంక్షేమ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇతర పాఠశాలలో ఉన్న సిబ్బందిని డెప్యుటేషన్‌పై కోనరావుపేట పంపించేలా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement