ఓ గిరిజన విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన మండలంలోని జామతండా శివారు జాదుతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
నెల్లికుదురులో గిరిజన విద్యార్థిని అదృశ్యం
Aug 29 2016 12:33 AM | Updated on Sep 4 2017 11:19 AM
నెల్లికుదురు : ఓ గిరిజన విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన మండలంలోని జామతండా శివారు జాదుతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొబేషనరీ ఎస్సై రాకేష్ కథనం ప్రకారం.. జాదు తండాకు చెందిన గిరిజన విద్యార్థి నెల్లికుదురు జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 19న పాఠశాలకని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని విద్యార్థిని మేనమామ గుగులోతు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement