పాలకొల్లు టౌన్ : భక్తులను హరిద్వార్ తీసుకెళ్తానని నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన యతిరాజా ట్రావెల్ సంస్థ యజమాని రామానుజం వెంకటరమణకు ఏడాది జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం పాలకొల్లు కోర్టు మేజిస్ట్రేట్ ఎ.నాగశైలజ తీర్పుచెప్పారు.
ట్రావెల్ సంస్థ యజమానికి జైలు
Oct 15 2016 1:37 AM | Updated on Sep 4 2017 5:12 PM
పాలకొల్లు టౌన్ : భక్తులను హరిద్వార్ తీసుకెళ్తానని నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన యతిరాజా ట్రావెల్ సంస్థ యజమాని రామానుజం వెంకటరమణకు ఏడాది జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం పాలకొల్లు కోర్టు మేజిస్ట్రేట్ ఎ.నాగశైలజ తీర్పుచెప్పారు. 2013 సెప్టెంబర్‌లో పట్టణానికి చెందిన మామిడి వెంకటేశ్వరరావు (బాబు)తోపాటు 23మంది హరిద్వార్ వెళ్లడానికి ట్రావెల్ సంస్థ యజమాని వెంకటరమణకు ఒక్కొక్కరూ రూ.13వేలు చొప్పున చెల్లించారు. ఢిల్లీ వరకు టికెట్లు తీశారు. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లేందుకు ట్రావెల్ యజమాని టికెట్లు తీయకుండా మోసం చేశారు. దీనిపై మామిడి వెంకటేశ్వరరావు పాలకొల్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement