నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను కుదించినట్లు గుంటూరు డివిజన్ సీనియర్ టీటీఐ జయరామిరెడ్డి తెలిపారు.
రైళ్ల రాకపోకలు కుదింపు
Sep 24 2016 11:27 PM | Updated on Sep 4 2017 2:48 PM
నూనెపల్లె: నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను కుదించినట్లు గుంటూరు డివిజన్ సీనియర్ టీటీఐ జయరామిరెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ విజయవాడ–హుబ్లీ (17225), హుబ్లీ–విజయవాడ(17226) ట్రై న్ నంద్యాల మీదుగా వెళ్తుందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో చేపడుతున్న ఇంటర్‌లింక్ మరమ్మతుల కారణంగా గుంటూరు వరకే అనుమతిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు– కాచిగూడ(57306), కాచిగూడ– గుంటూరు (57305) ట్రై న్ కూడా నంద్యాల మీదుగా వెళ్లాల్సి ఉండగా కాచిగూడలో చేపడుతున్న పనుల కారణంగా మహబూబ్‌నగర్ వరకే వెళ్లేలా రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారన్నారు. రైళ్ల రాకపోకల్లోని మార్పులను గమనించాలని ప్రయాణికులకు సూచించారు.
Advertisement
Advertisement