బిలాస్‌పుర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్పైకి మూడు రైళ్లు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. లోకో పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడం ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోట్మి సోనార్- జైరామ్‌నగర్ స్టేషన్ల మధ్య ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు ఒకేసారి వచ్చాయి.
ఒక ప్యాసింజర్ రైలు ముందు, వెనుక రెండు గూడ్స్ రైళ్లు ఉన్నట్లు సమాచారం. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల ఇదే రాష్ట్రంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లోకో పైలట్ సహా 11 మంది మృతి మరణించారు.
ఆ ఘటన మరవకముందే.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడంపై రైల్వే పనితీరుపై ప్రశ్నలు తలెత్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యం అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎందుకు ఉన్నాయనే అంశంపై బిలాస్‌పూర్ డివిజన్ సీనియర్ డీసీఎం అనురాగ్ కుమార్ సింగ్ స్పష్టతనిస్తూ.. ఇది నిర్లక్ష్యం కాదని, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సాంకేతిక ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో రైల్వే వ్యవస్థపై తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చేస్తున్నారని డీసీఎం అన్నారు. వాస్తవానికి, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కింద, రైళ్లను దాదాపు 90 మీటర్ల నిర్ణీత దూరంలో ఒకే ట్రాక్‌పైకి తీసుకురావచ్చు. ఇది పూర్తిగా సాంకేతికంగా సురక్షితమైన ప్రక్రియ అని ఆయన వెల్లడించారు.


