నన్ను టార్గెట్‌ చేసే శక్తి కేసీఆర్‌కు లేదు: భట్టి | TPCC Working President Bhatti Vikramarka fires on CM KCR | Sakshi
Sakshi News home page

నన్ను టార్గెట్‌ చేసే శక్తి కేసీఆర్‌కు లేదు: భట్టి

Feb 15 2016 6:52 PM | Updated on Jul 11 2019 7:48 PM

నన్ను టార్గెట్‌ చేసే శక్తి కేసీఆర్‌కు లేదు: భట్టి - Sakshi

నన్ను టార్గెట్‌ చేసే శక్తి కేసీఆర్‌కు లేదు: భట్టి

తనను టార్గెట్‌ చేసే శక్తి, ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఎర్రుపాలెం (ఖమ్మం) : తనను టార్గెట్‌ చేసే శక్తి, ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ప్రజలపై సీఎంకు ఏమాత్రం ప్రేమ లేదని, ఈ రెండు రోజులు అబద్ధాలు చెప్పడానికే వచ్చారని విమర్శించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ పేరుతో లక్షా 11వేల కోట్ల రూపాయల ఆర్ధిక దోపిడీకి సీఎం శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement