పర్యాటకానికి ఊతం.. ఉపాధికి మార్గం | Tourism employment to rise for on website | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి ఊతం.. ఉపాధికి మార్గం

Jan 25 2017 2:54 AM | Updated on Sep 5 2017 2:01 AM

చారిత్రాక, పర్యాటక అవకాశాలున్న ప్రాంతాలను వెలుగులోకి తేవడంతోపాటు స్థానిక యువతకు కొంత ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు వచ్చింది...

వినూత్నంగా ముందుకొచ్చిన ఓ వెబ్‌సైట్‌
సాక్షి, హైదరాబాద్‌: చారిత్రాక, పర్యాటక అవకాశాలున్న ప్రాంతాలను వెలుగులోకి తేవడంతోపాటు స్థానిక యువతకు కొంత ఉపాధి కల్పించే లక్ష్యంతో toours.com వెబ్‌సైట్‌ ముందుకు వచ్చింది. ప్రతి ఊరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయని... ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తే ఎటువంటి పెట్టుబడీ లేకుండానే ఉపాధి పొందవచ్చని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సతీశ్‌రెడ్డి వెల్లడించారు. కనులవిందైన ప్రదేశమైనా, పర్యాటక ప్రాంతమైనా, సాహస యాత్ర అయినా, వృక్ష శాస్త్రం గురించి తెలుసుకోవడమైనా.. పర్యాటకులను ఆకట్టుకునే ఆలోచన ఉంటే తమ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇందుకు ఎటువంటి ఖర్చు లేదని చెప్పారు. టూర్స్‌ మొబైల్, వెబ్‌ ఆధారిత వేదిక ద్వారా గ్రామీణ పర్యాటకానికి మంచి ఊపు వస్తుందని... ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు. తొలుత టూర్స్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెలలో మొబైల్‌ యాప్‌ను కూడా ఆవిష్కరించనున్నామని వెల్లడించారు. దీన్ని వేదికగా చేసుకునేవారికి ఎలాంటి ఖర్చూ ఉండదని తెలిపారు. ఎవరైనా తమ ఆలోచనలు, వివరాలు ఫోన్‌ నంబర్‌ సహా వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే తమ సిబ్బంది వారిని సంప్రదించి.. పూర్తి వివరాలు తెలుసుకుని వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారని సతీశ్‌రెడ్డి వెల్లడించారు. ప్రపంచ పటంలో మనదేశ పర్యాటకానికి గొప్ప స్థాయి తెచ్చే ఉద్దేశంతో ఈ ఆవిష్కరణకు సిద్ధమయ్యామని, ఇందులో లాభాపేక్ష లేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement