కోటప్ప సన్నిధి.. ఆహ్లాదపు లోగిలి | 'Tourism' developed in Kotappakonda | Sakshi
Sakshi News home page

కోటప్ప సన్నిధి.. ఆహ్లాదపు లోగిలి

Oct 8 2016 8:54 PM | Updated on Sep 4 2017 4:40 PM

కోటప్ప సన్నిధి.. ఆహ్లాదపు లోగిలి

కోటప్ప సన్నిధి.. ఆహ్లాదపు లోగిలి

కోటప్పకొండ పర్యాటక శోభను సంతరించుకోనుంది.

కోటప్పకొండ పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఇకపై కొండ దిగువన ఎర్రచెరువులో ఫుడ్‌కోర్టు, లేజర్‌ షో, బోట్‌ షికారు భక్తులను హుషారెత్తించనున్నాయి. కొండ చరిత్ర లేజర్‌ షో ద్వారా కళ్లకు కట్టనుంది. దీని కోసం రెండు యాంపిల్‌ థియేటర్స్‌ ముస్తాబవుతున్నాయి. భక్తులను రండి రండి రండి దయచేయండి అంటూ స్వాగత ద్వారం ఆహ్వానించబోతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఆధ్మాత్మిక సొబగులు అద్దుకుంటున్న కోటయ్య సన్నిధి ఇకపై పర్యాటానికి పెన్నిధిగా దర్శనమివ్వనుంది. రూ.3.5 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతూ రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. ఇదే ప్రాంతంలో రోప్‌వే ఏర్పాటు ప్రతిపాదనలూ అమలు పట్టాలెక్కితే కోటప్పకొండ ఆహ్లాదపు మణికొండగా అలరించడం ఖాయం. – నరసరావుపేట రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement