రేపు చీనీ, నిమ్మ సాగుపై శిక్షణ | tomorrow training on crops | Sakshi
Sakshi News home page

రేపు చీనీ, నిమ్మ సాగుపై శిక్షణ

Jan 8 2017 10:54 PM | Updated on Jun 1 2018 8:39 PM

చీనీ, నిమ్మ తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, మార్కెటింగ్‌ అంశాలపై మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖరగుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : చీనీ, నిమ్మ తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, మార్కెటింగ్‌ అంశాలపై  మంగళవారం  స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖరగుప్తా  ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్తలు   బి.శ్రీనివాసులు,   కేసీ నటరాజ్‌ హాజరై అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు చీనీ, నిమ్మ రైతులు 08554–270430, 81420 28268 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement