అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీళ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రేపు మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా
Mar 7 2017 12:36 AM | Updated on Sep 5 2017 5:21 AM
కర్నూలు: అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీళ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు జిల్లాలో మూడు విడతలుగా ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. కార్మికుల నుంచి భారీ స్పందన రావడంతో మహిళలకు కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల కోసం 8వ తేదీ ప్రత్యేకంగా స్లాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.
Advertisement


